Facts of Kashmir Mistory

69 ఏళ్ళ కాశ్మీర్ సమస్య రగిలిస్తుంది పాకిస్తానా? చైనానా? నిజాలన్నీ మీ కోసం!!
ఇది దేశం గురించి ఆలోచించే ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవలసిన నిజం..! ఈ నిజాన్ని మీరు గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా... ఓ దేశ భక్తుడిగా ఒక్కసారి చదవాల్సిన విషయం..!!
యూరీ దాడుల తర్వాత మన దేశ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో మనకి తెలిసిన విషయమే. ఆర్ధికంగా పాక్ ని దేబతీయటం కావచ్చు, సింధు నది విషయంలో తీసుకున్న నిర్ణయం కావచ్చు లేదా సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు.. ఏది ఏమైనా మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయగలమా??
మన భూభాగంలో ఒకటైన జమ్మూ కాశ్మీర్ లో గత 69 ఏళ్ళగా రగులుతున్న కష్టాలని సహిస్తున్న భారత్, అక్కడ రోజురోజుకి పెరుగుతున్న తీవ్రవాదం నుంచి మనల్ని కాపాడుకుంటూ వస్తున్న భారత్.. పాక్ మీద యుద్ధానికి దిగుతుందా?? ఒకవేళ యుద్ధం చేయకపోతే దానికి కారణాలు ఏంటి?? వీటికి సమాధానం శోధించటంతో తెలిసిన కొని నిజాలు మీ కోసం...
ప్రాంతీయ రాజకీయాలు:
1950 లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ కోసం ఉత్తర పాకిస్తాన్ ను భారత్ కు ఇచ్చేయడానికి కూడా సిద్ధ పడింది. దీని బట్టి మనమర్ధం చేసుకోవాలిసిన విషయమేంటంటే.... పాకిస్తాన్ కాశ్మీర్ ను కోరుకుంటుంది అక్కడ వల్ల మతస్తులు ఉన్నందుకో లేక కాశ్మీర్ ప్రజలు వారిని కోరుకున్నందుకో కాదు. దానికన్నా పెద్ద రహస్యమే ఉంది.
చైనా మరియు సీ.పీ.ఈ.సీ (చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్): China and C P E C (China-Pakistan Economic Corridor)
ఒక్కసారి ఇది అర్ధమైతే... చాలామటుకు అర్ధమైనట్టే!! అసలు పాకిస్తాన్, బలూచిస్తాన్, భారత్ ఎందుకు యుద్ధం చెయ్యట్లేదు?? ప్రపంచ అగ్ర దేశాలు కూడా దీని మీద ఎందుకు ఎక్కువ ఒత్తిడి తేవట్లేదు?? అందరికి పాకిస్తాన్ అనే దేశం తప్పు చేస్తుందని తెలిసినా, పాకిస్తాన్ సరిదిద్దుకునే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు?? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం వెతుకుతుంటే... మన దృష్టి పక్కనే ఉన్న మరో దేశం చైనా మీదకు పోకుండా ఉండదు. పాకిస్తాన్ 1990 వరకు కాశ్మీర్ గురించి అంతగా పోరాడలేదు. యుద్ధాలలో ఓడి.. బ్రతుకు జీవుడా అని వదిలేసిన దేశం పై కాస్తంత విశ్వసం కూడా లేదు. ఎపుడైతే చైనా వాళ్ళు సీ.పీ.ఈ.సీ (చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్) అనేది ప్రవేశపెట్టారో... అప్పటి నుండే అసలైన టెర్రరిజం మొదలైంది.
అసలు ఈ సీ.పీ.ఈ.సీ (చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్) అంటే ఏంటి? దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారు?
మనకు ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది.. చైనాకి పడమర వైపున ఉన్న సముద్రాలకు అసలు సంబంధం లేదు. ఒక్క వేల ఆ సముద్ర భాగంలో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా... భారత్ మొత్తం తిరిగి అవతల ఉన్న దేశాలకు వెళ్ళాలి. చైనాకు మరో వైపున అన్ని శత్రు దేశాలై ఉన్నాయి. అవే ASEAN కంట్రీస్ (బర్మా, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిపైన్స్, సింగపూర్, థాయిలాండ్). ఒకవైపు భారత్, మరో వైపు ASEAN కంట్రీస్... దిక్కు తోచని పరిస్థితుల్లో నుంచి పుట్టుకొచ్చిన మాస్టర్ ప్లానే సీ.పీ.ఈ.సీ.
చైనా ఆర్థిక వ్యవస్థ
ఒకవేళ పాకిస్తాన్ నుంచి అరేబియన్ సముద్రానికి రోడ్ లేదా రైల్ మార్గం ఉంటే మన పని సులభం అవుతుందని ఆలోచించి సీ.పీ.ఈ.సీ ని ప్రవేశపెట్టారు. చైనా లోని కష్గర్ నుండి పాకిస్తాన్ లోని గ్వాదర్ (ఇపుడు బలూచిస్తాన్) వరకు ఉచితంగా రోడ్ లేదా రైల్ మార్గం వేయటమే సీ.పీ.ఈ.సీ. ఇవన్ని సాధ్య పడడానికి కావలసిన మౌలిక సదుపాయాలు, అవసరమైయే డబ్బుని చైనా ఈ సీ.పీ.ఈ.సీ ఒప్పందం ద్వారా కలిపిస్తుంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు 160కీ.మీ వేగంలో ప్రయాణించగలిగే రైల్ రోడ్స్, 8 లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేస్, కోల్, థర్మల్, సోలార్, హైడ్రో పవర్ స్టేషన్ లు అని చైనా ఈ సీ.పీ.ఈ.సీ ఒప్పందం ద్వారా కలిపిస్తుంది. ఇంతటితో అయిపోలేదు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, లాహోర్ లోని మెట్రో రైల్.. ఇలా అన్నిటిని చైనానే చూసుకుంటుంది. అంత బానే ఉంది... కాని దీంతో కాశ్మీర్ కు ఏంటి సంబంధం?
సీ.పీ.ఈ.సీ కి జమ్మూ కాశ్మీర్ కి సంబంధం ఏంటి??
పాకిస్తాన్ కి చైనా కి బార్డర్ కలవాలంటే కాశ్మీర్ ఒకటే మార్గం. ఈ కలయిక సాధ్యమైయేది ఒక్క POK (పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్) నుంచే సాధ్యమవుతుంది. జమ్మూ కాశ్మీర్ మన భారత దేశంలోని భాగమని మనందరికీ తెలిసిన విషయమే. 1947 లో పాకిస్తాన్ విడిపోయినప్పుడు చట్టబద్ధంగా జమ్మూ కాశ్మీర్ మనకు దకింది. కానీ కాశ్మీర్ లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించింది. అంతే కాకుండా ఉత్తరంలోని షక్స్గమ్ ప్రాంతాన్ని 1960 లో పాకిస్తాన్, చైనా కి గిఫ్ట్ గా ఇచ్చింది. ఆంటే ఆ ప్రాంతం చైనా ఆదీనంలో ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే POK లేకుంటే పాకిస్తాన్ చైనా మధ్యలో సంభందమే ఉండదు. సీ.పీ.ఈ.సీ అనేది ఇటీవల ప్రారంభమైనా, ఈ ఆలోచన ఏపడిదో. ఈ కారకోరం హైవే కట్టడం 1959 లోనే మొదలైంది, ఈ హైవే 1979లో వాడకంలోకి వచ్చింది. పాకిస్తాన్ మొదట్లో చైనా ని అడ్డుకున్నా... 1990 తర్వాత పరిస్థితుల్లో చైనా తో సంబంధం పెట్టుకోవటం తప్ప వేరే దారి లేక కారకోరం హైవే ని చైనా చేతుల్లో పెట్టింది.
అసలు ఈ సీ.పీ.ఈ.సీ నుంచి చైనా కి ఏంటి లాభం??
పాకిస్తాన్ లోని గ్వాదర్ అనే ప్రదేశం మస్కట్ కు 400కీ.మీ దూరంలో ఉంది. ఒమాన్, పెర్షియన్ దేశాలకు 500కీ.మీ దూరంలో ఉంది. ఇక్కడ నుంచే గల్ఫ్ ఆయిల్ నిక్షేపాలని తరులుతాయి. సముద్ర మార్గం నుండి 12గంటల్లో ఆఫ్రికాని చేరుకోవచ్చు. ఆఫ్రికాలోని సగం కన్నా ఎక్కువ భాగం చైనా చేతుల్లోనే ఉంది. ఎనో లక్షల కోట్లు పెట్టుబడి పెటింది చైనా ఈ దేశంలో. ఆఫ్రికాలోని సహజ వనరులలో అధిక మొత్తం చైనాకే వెళ్తుంది. ఇవన్ని సాధ్యం అవడానికి కారణం.. చైనా ఈ దేశాలన్నిటిని వల్ల వస్తువులతో ముంచేశారు. అతి తక్కువ ధరలకే విలాసాలు దొరుకుతుంటే ఎవరు మాత్రం వద్దంటారు? చైనా వస్తువులని భారత దేశమే వద్దనలేకపోతుంది. మరి చిన్న దేశాల పరిస్థితి ఎంత? ఒకవేళ ఇండియా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ కలిసి చైనాని ఇండియన్ ఓషన్ వాడుకోనీయకపొతే.. చైనా కి ఎలాంటి బాధ ఉండదు. సీ.పీ.ఈ.సీ ఉండడం వల్ల సమయం, డబ్బు అన్ని కలిసొస్తాయి. కాని ఇవన్ని ఇలానే జరుగుతూ ఉండాలంటే POK పాకిస్తాన్ చేతుల్లోనే ఉండాలి.
డబ్బు ప్రమేయం..
ఈ సీ.పీ.ఈ.సీ వల్ల చైనా ఎనో లక్షల కోట్లు పాకిస్తాన్ పై ఖర్చు పెటింది. పాకిస్తాన్ లో చైనా నిర్మించిన వాటిపై ఎక్కువ హక్కు చైనాకే ఉంది. ఇదొక్కటే కాకుండా పాకిస్తాన్ GDPలో 20% కంటే ఎక్కువ చైనాదే. అంటే పరోక్షంగా పాకిస్తాన్ మొత్తం చైనాదే. ఎంత అంటే.. పాకిస్తాన్ ని చైనా వాళ్ళు వల్ల దేశంలో ఒక్క స్టేట్ లా భావించే అంత. ఇంత డబ్బు, ఇంత సమయం, ఇంత టెక్నాలజీ చైనా పాకిస్తాన్ మీద పెట్టినపుడు ప్రత్యేక్షంగా కాని పరోక్షంగా కాని పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటిస్తే... చైనా ఏం చేయడానికైనా వెనకాడదు. ఎందుకంటే పరోక్షంగా పాకిస్తాన్ చైనాదే కదా.
మరి భారత దేశానికి దీని గురించి తెలియదా??
పాకిస్తాన్ ని ఓడించడం పెద్ద పని కాదు... కాని చైనా కూడా ఈ విషయంలో కలగజేసుకుంటే ఒకేసారి రెండు దేశాలతో గొడవకు దిగడం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వీరితో యుద్ధానికి దిగితే... మన చుటూ మనకు సహకరించడానికి ఏ దేశము లేదు. ఇదంతా మనకు అర్ధమవ్వాలంటే... ముందు అంతర్జాతీయ రాజకీయాలు ఎలా నడుస్తాయో తెలియాలి.
అంతర్జాతీయ రాజకీయాలు..
పాకిస్తాన్ విషయంలో అమెరికా, భారత్ కు మద్దతు ఇస్తుంది... కాని చైనా విషయంలో ఇవ్వలేదు. అంటే పాకిస్తాన్ తప్పు చేస్తుందని అంటుంది గాని POK గురించి మాట్లాడదు. ఎందుకంటే.. అమెరికా సంస్థలు చైనాలో భారిగా పెట్టుబడి చేసాయి. రష్యా గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు... ఎందుకు ఆంటే పుతిన్ కు, రష్యాకు ఆ దేశ సమస్యేలే చాల ఉన్నాయి. అది కాకుండా పుండు మీద కారం జల్లినట్టు... భారత్ అమెరికా పాట పాడడం వల్ల రష్యా దూరమైంది. ఎప్పటిలాగే ఏం జరిగినా మనం నష్ట పోకూడదన్నట్టు యూరోప్ కంట్రీస్ ఏం స్పందించకుండా ఉంటాయి. ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ గురించి కూడా ఆలోచించనవసరం లేదు... మతం చూసుకొని పాకిస్తాన్ కే సపోర్ట్ చేస్తాయి. అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ స్నేహాలన్ని ఇలానే ఉంటాయి. ఒక దేశానికి మద్దతు పలికితే మనకు ఏంటి లాభం, నాకు వచ్చేదేంటి, పోయేదేంటి అనే ఆలోచిస్తాయి .
ఇంత పెద్ద చదరంగం ఆటలో పాకిస్తాన్ ఒక్క పావు మాత్రమే..
మనకి కనపడుతుంది పాకిస్తాన్ మాత్రమే. పాకిస్తాన్ వల్లకి ఉన్న దేశాన్నే పరిపాలించే దిక్కు లేదు... ఇక POK తీసుకొని ఏం చేస్తుంది. అసలు తీసుకోలేదు కూడా..! కాశ్మీర్ మీద అసలు చైనా కన్ను పడింది. POK వల్ల లాభపాడేది చైనానే. కాశ్మీర్ లో ప్రశాంతత లేకుండా ఉండటమే చైనాకి కావాల్సింది. ఒకవేళ అక్కడ ప్రశాంతత నెలకొంటే భారత్ POKని తిరిగి దక్కించుకుంటుంది. అదే జరిగితే కారకోరం హైవే భారత్ అధీనంలోకి వస్తుంది. అప్పుడు సీ.పీ.ఈ.సీ కి అర్ధం లేకుండా పోతుంది. చైనా ప్రత్యేక్షంగా కాని పరోక్షంగా కాని పాకిస్తాన్ ని సొంతం చేసుకుంది. అలాంటిది ఎత్తి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ని వదులుకోదు. కాశ్మీర్ లో జరిగే గొడవలు చైనా సృష్టించినవి కాకపోవచ్చు... కాని అవి ఆగిపోతే ఎక్కువగా నష్టపోయేది చైనానే. కాశ్మీర్ లో ఉన్న ప్రజల నీళ్ల సమస్య కన్నా, మతం సమస్య కన్నా, ప్రజలు ఏ దేశంలో ఉండాలి అనే సమస్య కన్నా... ఎన్నో రెట్లు పెద్దది చైనా సీ.పీ.ఈ.సీ. ఇది ఇలానే కొనసాగాలంటే POK లో ఎప్పటికి శాంతి ఉండకూడదు. ఈ అవసరం చైనా కన్నా ఎక్కువ ఇంకెవరికీ లేదు. లేదా POK పూర్తిగా పాకిస్తాన్ లో భాగం అయిపోవాలి. అది ఎప్పటికి జరగని పని అని మనందరికీ తెలుసు.
మరి భారత్ ఏమైనా చేయగలదా??
భారత్ దేశం చేయగలదు.. ప్రతి భారతీయుడు సహకరిస్తే..!! అవును.. చైనా ఇపుడు ఆర్థిక తిరోగమనం (economical slump) లో పడింది. గ్లోబల్ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం చైనా వారి వస్తువుల ధరలు ఇక తగ్గించి... అతి తక్కువ ధరలకే అమ్మనుంది. వారి వ్యాపారాన్ని కాపాడే అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశం భారత దేశమే. ప్రతి సంవత్సరం 60 లక్షల కోట్లు మన డాబు చైనాకి వెళ్తుంది. ఊహించడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షర సత్యం. అందుకే.. మనం చైనా వస్తువులు కొనకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దెబ్బతింటుంది. మనం మన దేశంలో తయ్యారయ్యే వస్తువులు కొనటం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇదే కనుక మనం ఎప్పటికి కొనసాగించగలిగితే.... మనం చైనాని ఆదేశించే రోజు త్వరలోనే వస్తుంది. మనమంతా చేయవలిసిన పని ఒకటే... చైనా వస్తువులు కొనకూడదు.. అలానే వాటిని అమ్మకూడదు.
* ముందుగా మీరు కొనే వస్తువు పై ఉన్న బార్ కోడ్ ని గమనించండి.
* బార్ కోడ్ లో ముందు మూడు అంకెలు ఏ దేశానికి చెందినదో తెలుపుతాయి.
* ఆ బార్ కోడ్ లో ముందు మూడు అంకెలు 690 నుండి 695 లోపు ఉంటె అవి చైనా వస్తువు అని అర్ధం.
* మీరు ఈ వస్తువులను కొంటె డబ్బులిచ్చి మరీ చైనా కి సపోర్ట్ చేస్తున్నవారవుతారు.
#BK

Comments

Popular posts from this blog

RIP Devineni Nehru

Baahubali 2 The Conclusion Movie Review