నిను కోరి movie Review

నిన్నుకోరి మూవీ రివ్యూ
సినిమా : నిన్నుకోరి
బ్యానర్: డివివి ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్
నటినటులు: నాని, నివేథా థామస్ , ఆది పినిశెట్టి , మురళి శర్మ, తనికెళ్ళ భరణి, పృద్వి తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: గోపీ సుందర్
దర్శకత్వం : శివ నిర్వాణ
ప్రొడ్యూసర్: డివివి దానయ్య

భలే భలే మగాడివోయి , ఎవడే సుబ్రహ్మణ్యం , క్రిష్ణగాడి వీర ప్రేమగాధ, మజ్ను , నేను లోకల్ వంటి వరుస హిట్స్ తో మంచి ఫాం లో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని ఏ సినిమా చేసినా అది హిట్టే అన్నట్లుంది పరిస్థితి. ప్రస్తుతం శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడితో , డివివి దానయ్య నిర్మాణం లో నిన్ను కోరి అనే మూవీ లో నటించాడు. అది ఇవాల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటినుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలోని పాటలు కూడా యూత్ ని బాగా అలరిస్తున్నాయి . ట్రైలర్ చూస్తే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ లా అనిపిస్తుంది. చూద్దాం ఈ సినిమా ఎలా ఉందో?
కథ:
స్టోరీ:
ఈ సినిమా కథ అమెరికా లో మొదలయ్యి అమెరికాలో ముగుస్తుంది. పల్లవి (నివేత), అరుణ్(ఆది పినిశెట్టి) లు బార్యాభర్తలు. వారి మొదటి ఆనివెర్సరీ సెలెబ్రేట్ చేసుకునే రోజు పల్లవి ఉమాని (నాని) కలుస్తుంది. పల్లవి అరుణ్ ని పెళ్లి చేసుకునే ముందు వైజాగ్ లో ఉమాని ప్రేమిస్తుంది. ఉమా (నాని) ఒక స్టాటిస్టిక్స్ స్టూడెంట్. తను పల్లవిని (నివేత) ప్రేమించి తన ప్రేమని కూడా తిరిగి పొందుతాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాము అనుకుంటారు . కానీ , కొన్ని పరిస్థితుల వల్ల పల్లవి ఉమాని కాదని (బ్రేకప్) అరుణ్(ఆది పినిశెట్టి)ని పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్తుంది. ఆ తర్వాత అమెరికాకి వచ్చిన ఉమా పల్లవి, అరుణ్ లని ఎందుకు కలుస్తాడు? ఈ ముగ్గురి మధ్యన జరిగే ఎమోషనల్ జర్నీ ఏంటి? అసలు ప్రేమించిన ఉమాని కాదని పల్లవి అరుణ్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది? అరుణ్ కి పల్లవి అంటే ఎంత ఇష్టం? చివరకు ఈ ముగ్గురి పాత్రలకి మధ్య జరిగే సంఘర్షణకి దర్శకుడు ఎలాంటి ముగింపుని ఇచ్చాడు అనేదే ఈ చిత్ర కథ .
ప్లస్ లు:
నాని మరియు నివేదా నటన
లవ్ సీన్స్
ఫీల్ గుడ్ మ్యూజిక్
నిర్మాణ విలువలు
ఎమోషనల్ క్లైమాక్స్
మైనస్ లు :
కామెడీ లేకపోవడం
అక్కడక్కడా సీన్స్ ల్యాగ్ అవ్వడం
కొత్త దర్శకుడు అవ్వడం వల్ల అక్కడక్కడ సీన్స్ పై గ్రిప్పింగ్ లేకపోవడం
చివరగా: నిన్నుకోరి…. సినిమా అయ్యాక కూడా మనల్ని వెంటాడే ఫీల్ గుడ్ లవ్ స్టొరీ.

FB Page :- https://www.facebook.com/2dayinformationn/
like this page and get more updates

Comments

Popular posts from this blog

Top Water Bottle Costs In World Wide

Wish You Happy Birthday day To Sachin Tendulkar , Sachin Full Biography