Baahubali 2 Overseas Review
బాహుబలి 2 ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది!!
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఊరిస్తున్న బాహుబలి కంక్లూజన్ రిలీజ్ కి ఇంకా రెండు రోజుల ముందే రివ్యూ రావడమేటి? అని అనుమానం కలగడం సహజమే. కానీ ఉమేర్ సంధూ అనే సినీ విశ్లేషకుడు ముందుగానే రాజమౌళి చెక్కిన శిల్పానికి చిన్న రివ్యూ రాశారు. ఇతను ఇండియా, బ్రిటన్, యూఏఈలోని సౌత్ ఏషియన్ సినిమా మ్యాగజైన్ లో ఫిలిం అండ్ ఫ్యాషన్ క్రిటిక్ పనిచేస్తున్నారు. ఆసియా సినిమాలకు మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన ఉమేర్.. యూఏఈ సెన్సార్ బోర్డు మెంబర్ గా కూడా పనిచేస్తున్నారు. ఈ విధంగా బాహుబలి 2 ని చూసే అవకాశం దక్కించుకున్నారు. సినిమా చూసిన ఆనందాన్ని రివ్యూ రూపంలో పంచుకున్నారు..
” బాహుబలి బిగినింగ్ కంటే బాహుబలి 2 వంద రెట్లు బాగుంది. కథ అద్భుతంగా ఉంది. అందుకు వీఎఫ్ఎక్స్ తోడై సినిమాని ఊహించనంత ఎత్తుకి తీసుకెళ్లింది. సినీ చరిత్రలో బాహుబలి కంక్లూజన్ మరో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం” అని ఫేస్ బుక్ లో చెప్పారు. బాహుబలి 2 గురించి పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు..
Comments
Post a Comment