Varangal District Collector Book 500 Tickets
బాహుబలి క్రేజ్ : 500 టికెట్స్ కొన్న కలెక్టర్
బాహుబలి క్రేజ్ మాములుగా లేదు. ఏదిఏమైనా బాహుబలి 2ని ఫస్ట్ డే ఫస్ట్ షోలో చూసేయాలని జనాలు డిసైడ్ అయినట్టు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ అధికారులు కూడా ఉండటం విశేషం. తాజగా, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఏకంగా బాహుబలి 2 కోసం ఏకంగా 500 టికెట్లని బుక్ చేసింది. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం. ఈ ఒక్కటి చాలు బాహుబలి 2 క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి.అయితే, కలెక్టర్ ఆమ్రపాలి తన కుటుంబంతో పాటు, సన్నిహితులు, స్నేహితులకి బాహుబలి 2 సినిమా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఆహ్వానం లిస్టులో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారట.మరోవైపు, బాహుబలి 2 బెనిఫిట్ షో టికెట్ల కోసం ప్రేక్షకులు పడరాని పాట్లు పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన కొందరు కేటుగాళ్లు ఆన్ లైన్ బుకింగ్ పేరుతో మోసాలకి పాల్పడుతున్నారు. బాహుబలి 2 టికెట్ బుకింగ్ పేరుతో ఫేక్ ఆన్ లైన్ బుకింగ్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చి డబ్బులు గుంజుతున్నారు. మొత్తానికి.. బాహుబలి 2 ఫీవర్ ఏ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు.
Comments
Post a Comment