Baahubali 2 The Conclusion Movie Review
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjIw_ov8EJ8QqyqoT6qW_SmefYmGe_EGbo2dmm35Kd2-nnrDN5KTXvbKTEVa7GgW1Fmdyg7yexAlhQXgCc47JE2vm5PqEMbFh1qulKAbneyEkkNcSjmQ3thZ1v6KOxUCLZctiRNSGO9fjVN/s320/prabhas-and-rana-daggubati-in-baahubali-2-the-conclusion-2017-large-picture.jpg)
బాహుబలి: ది కన్‌క్లూజన్ రివ్యూ చిత్రం: బాహుబలి: ది కన్‌క్లూజన్ నటీనటులు: ప్రభాస్.. రానా.. అనుష్క.. తమన్నా.. రమ్యకృష్ణ.. సత్యరాజ్.. నాజర్ తదితరులు ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్ కళ: సాబు సిరిల్ సంగీతం: ఎం.ఎం.కీరవాణి నిర్మాతలు: ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి విడుదల తేదీ: 28-04-2017 ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్నతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. యావత్ సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు రాజమౌళి. తనదైన భావోద్వేగాలకు తోడు అత్యాధునిక సాంకేతికను జోడించి ‘బాహుబలి: ది బిగినింగ్’ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా తదుపరి చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’పై అంచనాలను మరింత పెంచేసింది. మరోవైపు ఐదేళ్ల పాటు మరే సినిమా చేయకుండా కేవలం జక్కన్న ‘బాహుబలి’ యజ్ఞంలో పాలుపంచుకున్నాడు ప్రభాస్. తనదైన నటనతో అకట్టుకున్నాడు. మరి.. ఐదేళ్ల రాజమౌళి, ప్రభాస్‌ల కృషి ...